GUNTUR DISTRICT NEWS: మంగళగిరిలో బోయ, వాల్మీకిల‌ ఆందోళన

Karthik
7 Views

మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన బోయవాల్మీకులు నిరసన. కనిగిరి మున్సిపాలిటీలోని ఐదు ఎకరాల స్మశాన స్థలం కబ్జాకు గురి కాకుండా ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ వెంటనే కాపాడాలి అంటూ నిరసన. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకొని దీక్షటిడిపి నాయకులతో కలిసి పోలిసులు బోయ వాల్మీకులకు అన్యాయం చేస్తున్నారు. మా స్మశానం కాపాడండి అంటూ అడ్డుకున్నందుకు 45 మంది పైన కేసులు పెట్టారు. బోయవాల్మీకుల స్మశానం కాపాడుకోవాలని ప్రయత్నం చేసినందుకు చిన్న పిల్లలను కూడా చూడకుండా గొంతు మీద కాళ్ళతో తొక్కారు. ఈ రాష్ట్రంలో బోయవాల్మీకులు 50 లక్షల మంది పైగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం చిన్న స్థాయి కులాలను పట్టించుకోవడం లేదు అగ్రకులాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విషయం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని లేవదీస్తాం.

Author
Share This Article
Leave a review