భారత జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నరసరావుపేట పట్టణంలో ఈ నెల 26వ తేదీ ఉదయం 7.00 గంటలకు “సెన్సస్ 5కే రన్” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఈ 5కే రన్ కోడెల శివప్రసాద్ స్టేడియం నుండి ప్రారంభమవుతుంది అని తెలిపారు. జనగణన–2027 స్వీయ గణన కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం కల్పించడం, ప్రతి వర్గానికీ ఈ కార్యక్రమాన్ని చేరువ చేయడం లక్ష్యంగా ఈ 5కె రన్ నిర్వహించబడుతోందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పలు శాఖలకు బాధ్యతలు కేటాయించడం జరిగిందన్నారు. పోలీసు శాఖ ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేపడుతుందని, మున్సిపల్ శాఖ మార్గం పరిశుభ్రత, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తుందని, విద్యాశాఖ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల క్రీడాకారులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువజన సంఘాలు మరియు ప్రజలు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అని తెలిపారు.
PALNADU NEWS: స్వీయ గణనపై అవగాహనకు 26న 5కె రన్ – పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
26°C
Vijayawada
light rain
26° _ 26°
84%
5 km/h
Fri
33 °C
Sat
35 °C
Sun
38 °C


