Guntur, సెప్టెంబర్ 24: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని గడ్డిపాడు రైల్వే గేటు వద్ద ఈ నెల 26న జరగనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఆయన గడ్డిపాడు రైల్వే గేటు వద్ద శంకుస్థాపన జరగనున్న ప్రాంతాన్ని, సభా వేదిక ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శిలాఫలకం, సభావేదిక ఏర్పాట్లను రైల్వే అధికారులు ప్రోటోకాల్ ప్రకారం సిద్ధం చేస్తారని, GMC తరఫున తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- కార్యక్రమ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రజారోగ్య అధికారులకు,
- మెయిన్ రోడ్ లో ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు,
- సెంట్రల్ డివైడర్లలో మొక్కలకు ట్రిమ్మింగ్ చేయాలని ఉద్యాన విభాగానికి,
- అనధికార హోర్డింగ్స్, పోస్టర్లను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ పర్యటనలో GMC SE జి. వెంకటేశ్వరరావు, CMOH డాక్టర్ శాంతికళ, రైల్వే ADEN సతీష్ తదితర అధికారులు పాల్గొన్నారు.



