మంగళగిరి, ఆగస్టు 5 :– మంగళగిరి పట్టణంలోని మెయిన్ బజార్లో గాదంశెట్టి రామకృష్ణ ఫంక్షన్ హాల్లో మంగళవారం రచ్చబండ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2026–2028 సంవత్సరాల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వ్యవస్థాపక అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా మాగేటి సత్య బాలాజీ, గౌరవాధ్యక్షుడిగా మద్దుల ప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేదెళ్ల శ్రీనివాసరావు (వాసు), ఉపాధ్యక్షుడిగా గార్లపాటి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా పువ్వాడ సతీష్, కోశాధికారిగా భోజనపల్లి తాండవ, పబ్లిక్ రిలేషన్స్ చైర్మన్గా పసుమర్తి మురళీకృష్ణను ఎన్నుకున్నారు.
అలాగే సలహా సంఘ సభ్యులుగా వనమా కిరణ్ కుమార్, కొలిశెట్టి రామును, న్యాయ సలహాదారుగా రామకృష్ణను నియమించినట్లు వెల్లడించారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గం రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంస్థ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణకు సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు సభ్యులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసి, వారి పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.



