Vijayawada City news :విజయవాడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడికి అభినందనలు

Sharat
1 View

విజయవాడ:– గాంధీనగర్‌లోని గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ నందు మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సున్నపు వీరభద్ర చారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ ఆత్మీయంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డికి పరామర్శ

విజయవాడ: నిన్న జరిగిన డీఎస్సీ నిరసన ర్యాలీలో పోలీసుల లాఠీచార్జ్ కారణంగా అస్వస్థతకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ పరామర్శించారు. విజయవాడలోని గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.NTR District news

– తోలేటి శ్రీకాంత్,

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు.

Author
Share This Article
Leave a review