Guntur City News :ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు పి.జి.ఆర్.ఎస్. రద్దు-ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తాత్కాలిక విరామం.. సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి

S Sarath
1 View

గుంటూరు, నవంబరు 22:- జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణలో యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ వెల్లడించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ పూర్తిస్థాయిలో ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ ఉండదని తెలిపారు.Guntur City News

ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, పి.జి.ఆర్.ఎస్.లో తమ సమస్యలు వినిపించేందుకు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి ఇబ్బందులు పడవద్దని కలెక్టర్ సూచించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

Author
Share This Article
Leave a review