Amaravathi :-కేరళ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం చేరుకున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్సలో భాగంగా ఆయన కేరళకు వెళ్లారు.
కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా త్రిస్సూర్ సమీపంలోని ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరారు. అక్కడ ప్రత్యేక థెరపీ ద్వారా ఆయనకు చికిత్స అందించనున్నారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి తదుపరి కార్యక్రమాలు కొనసాగనున్నాయి.



