GUNTUR DISTRICT NEWS: ప్రతి మహిళ వంటింటికి 200 రూపాయలకి కనెక్షన్ ఇవ్వాలి

Karthik

మన భూగర్భం మన గ్యాస్ ముందుగా మనకి హక్కు ఉంటుందని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ మధ్యకాలంలో డీజిల్ కోసం రోడ్లమీద నిలబడటం గ్యాస్ కోసం మహిళలు ముఖ్యంగా చిన్నచిన్న హోటల్ మేస్సలు వాళ్లు ఇబ్బందులు పడటం బాధాకరం ఎందుకంటే మా కృష్ణ గోదావరి జిల్లాల భూగర్భంలోని ఈ నిక్షేపాలు పెట్టుకుని అన్నారు. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే న్యాచురల్ గ్యాస్ లో దాదాపు మూడో వంతు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటే ఇక్కడ ఇళ్ళకి 200 రూపాయలకి PNG ఇవ్వకుండా గుజరాత్ లో దాదాపు 30 లక్షల ఇళ్ళకి ఎలా ఇస్తారు అని అడిగారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హక్కుగా రావాల్సిన 50% రాయల్టీ మరియు ప్రాఫిట్ గ్యాస్ లో షేరు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని దీనికోసం ఎందాకైనా పోరాటానికి వెళ్తామని అన్నారు. ఇవన్నీ సాధించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ అప్పులు తెచ్చుకునే బాధ కొంతవరకు తప్పుతుంది అన్నారు. మన దగ్గర నుంచి గ్యాస్ లైన్ గుజరాతి మార్వాడి ఫ్యాక్టరీలకు వేసుకుంటా అది ఆంధ్రప్రదేశ్కు వరమని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఇదేమిటని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో గ్యాస్ మీద ఆధారపడి విద్యుత్తు ఉత్పాదన చేస్తున్న కంపెనీలను ఎండబెట్టి నేత రాష్ట్రాలకు సప్లై చేయటం దుర్మార్గమని అన్నారు. పైగా ఈ కంపెనీలకి మినిమం గ్యారెంటీ లెక్క రాష్ట్ర ప్రభుత్వం పెనాల్టీ రూపేనా నిధులు ఇవ్వటం ఇది మరీ దారుణం అని అన్నారు. మన గ్యాస్ ఇవ్వకుండా ఇరాన్ నుంచి గ్యాస్ వస్తుందని ఆ షిప్ ఒకటి బయలుదేరింది మా విశ్వ గురువుగారు గొప్పదనం అని చెప్పటం అసలు ప్రజలను ఫూల్ చేయడం కాదా అన్నారు. 2014లో క్రూడ్ ఆయిల్ ధర $ 130 బారెల్ వరకు వెళ్లిందని అప్పుడు డీజిల్ కేవలం 59 రూపాయలేనని, ఒక రూపాయి పెంచితే మోడీ అండ్ కో భయంకరమైన విమర్శలు చేశారని ఇప్పుడు ఏనాడు కూడా 130 డాలర్లకు చేరుకోకపోయినా ఈ డీజిల్ కొరత తాత్కాలింగ సృష్టించి ప్రజలను మాయ చేయడానికి కాదా అన్నారు. పాస్ అయిపోయిన 2023లోనే పాస్ అయిపోయిన చట్టం అయిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరో ఆఫ్ చేశారు అని గగ్గోలు చేసి ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పెట్రోల్ పంపు నాటకం మొదలు పెడతారా అన్నారు. తక్షణమే తెలుగు ప్రజలు దీని మీద స్పందించాలని మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ కి రాయల్టీతోపాటు ప్రతి ఇంటింటికి ప్రతి మహిళ వంటింటికి 200 రూపాయలకి కనెక్షన్ ఇవ్వాలని ఆ తర్వాత తెలంగాణకి ఇవ్వాలని ఆ తర్వాతే దేశంలో మిగతా ప్రాంతాలకు తరలించాలని అన్నారు. దీని మీద ఇప్పటికే గుంటూరు విజయవాడ రాజమండ్రి లలో సమావేశాలు జరిగాయని రాష్ట్రమంతా ప్రజలంతా దీనిమీద స్పందించాలని కోరారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review