GUNTUR DISTRICT NEWS: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

Karthik

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము ప్రాంగణంలో, డాక్టర్ కె. విజయలక్ష్మి, మలేరియా నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించి, ర్యాలీకి పచ్చ జెండా ఊపి, ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సభ్యులు మలేరియా నివారణ చర్యలపై స్లొగన్స్ ఇచ్చుకుంటూ, ర్యాలీ నగరం పాలెం మూడు బొమ్మల సెంటర్ వరకు కొనసాగి, తిరిగి కార్యాలయం చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని, నీటి నిల్వలను ఎప్పటి కప్పుడు పరిశుభ్రం చేసుకోవాలని, తద్వారా దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, దోమ కాటు నివారించడంలో భాగంగా దోమతెరలు తప్పకుండా వాడుకోవాలని, మలేరియా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలని, మలేరియా నిర్మూలన దిశగా “ఇప్పుడు మనం సాధించగలం- ఇప్పుడు మనం తప్పక సాధించాలి” అన్న నినాదంతో ముందుకు సాగాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బోదకాలు వ్యాధిగ్రస్తులకు, మోర్బిడిటీ మేనేజ్మెంట్ కిట్స్ అందజేయడం జరిగింది. ఈ కిట్స్ యొక్క ప్రాధాన్యతను, శ్రీ సుబ్బరాయణం, జిల్లా మలేరియా అధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఏ శ్రావణ్ బాబు, డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review