బాపట్లలో జర్నలిస్టులకు హెల్మెట్ పంపిణీ | ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రోడ్డు భద్రత పిలుపు

Jaya Raju
5 Views

బాపట్ల, ప్రతినిధి: సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టుల భద్రతపై బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ చేపట్టిన కార్యక్రమం ప్రశంసనీయం అని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు.

బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పాల్గొని హెల్మెట్లు పంపిణీ చేసి అనంతరం బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టారు.https://youtu.be/Og8dwTXaZFI

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎండా–వాన తేడా లేకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు తమ భద్రతను విస్మరించకూడదని సూచించారు. వార్తల సేకరణలో వేగంగా ప్రయాణించే సందర్భాల్లో హెల్మెట్ ధరించడం అత్యవసరమని పేర్కొన్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో విశాలాంధ్ర విలేకరి కాగిత ప్రశాంత్ మృతి పట్ల ఎమ్మెల్యే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఒక యువ జర్నలిస్టును కోల్పోయామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.https://youtu.be/hB3Ki-70YlM?si=F37bVfzziisHKWm7

అసెంబ్లీలో కూడా రహదారి భద్రతపై తాను పలుమార్లు ప్రస్తావించానని గుర్తు చేసిన ఎమ్మెల్యే, ప్రెస్ క్లబ్ సభ్యులు హెల్మెట్ ధారణలో ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చా

Author
Share This Article
Leave a review