అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా జైలు యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగా శిక్షకులు ఖైదీలు మరియు జైలు సిబ్బందికి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం మరియు శ్వాస వ్యాయామాలపై శిక్షణ అందించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో సుమారు 200 మంది ఖైదీలు మరియు 60 మంది జైలు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను పొందారు. కార్యక్రమంలో పాల్గొన్న ఖైదీలు యోగా తమలో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను మరియు మానసిక ప్రశాంతతను పెంపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎ.బి. కాంతరాజ్, జైలర్ సి.హెచ్. కిరణ్, జైలర్ వై. శ్రావణ్ కుమార్, డిప్యూటీ జైలర్ ఎ. కళ్యాణ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. జైళ్లలో ఖైదీల శారీరక, మానసిక వికాసానికి యోగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
GUNTUR DISTRICT NEWS: జిల్లా జైలులో యోగా దినోత్సవ వేడుకలు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
light rain
27° _ 27°
79%
1 km/h
Tue
36 °C
Wed
36 °C
Thu
36 °C


