GUNTUR DISTRICT NEWS: క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన 9 మంది నిందితుల అరెస్ట్

Karthik

గుంటూరులో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారాన్ని నగరంపాలెం పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇందులో 9‌ మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి, 1,10,000‌ రూపాయల నగదు, 7 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు.ఆన్ లైన్ ప్లాట్ పామ్స్ వినియోగించుకుంటూ బెట్టింగ్ కు పాల్పడినట్లు చెప్పారు.అక్రమ బెట్టింగ్ చట్టరీత్యా నేరం, ఆర్ధికంగా దెబ్బతినడం జరుగుతుందన్నారు.డబ్బును కోల్పోయి మానసికంగా దెబ్బతినడం, భవిష్యత్ అంధకారంలో పడటం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Author
Share This Article
Leave a review