ఏఎన్యూ బీఈడీ పరీక్షల లో అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీఈడీ నాలుగో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను కోట్ల రూపాయల విద్య వ్యాపారంగా అధికారులు మార్చారని ఆరోపించారు. థియరీ పరీక్షలలోను ఒకరి బదులు మరొక రాయించటం కాపింగ్ చేయించడం దారుణమని ఏఎన్యూ వైసీపీ విద్యార్థి విభాగం గౌరవ అధ్యక్షులు పంతగాని రమేష్ పేర్కొన్నారు అమరావతి లోని కళాశాలకు 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినుకొండ కళాశాల పరీక్షా కేంద్రంగా కేటాయించటం… వినుకొండ నరసరావుపేటలోని ఒకే యాజమాన్యం కు చెందిన కళాశాలను సెంటర్లుగా కేటాయించడం.. బీఈడీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారి కళాశాలలకు సెంటర్లను కేటాయించటం జరిగిందన్నారు.. 6 బీఈడీ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేయటం ద్వారా వర్సిటీ అక్రమాలకు ఆస్కారం కలిగించారన్నారు. ఒక్కొక్క పేపర్ కి 1500 నుంచి 2000 రూపాయలు వసూలు చేసి నరసరావుపేట వినుకొండ తోపాటు పల్నాడులోని మరో రెండు సెంటర్లలో కాఫీ చేయించారని చెప్పారు. పీజీ కోఆర్డినేటర్ హయాంలో బీఈడీ పేపర్ల లీకేజీ జరిగిన.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసిన… బహిరంగంగా కాపీయింగ్ చేసినట్టు ఫిర్యాదులు వచ్చిన ఉన్నత అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీజీ విభాగంలోని అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఈడీ పరీక్షలు ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసిన వ్యవహారంలో పరిశీలకుల తోపాటు అధికారుల పైన కళాశాల పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఎన్యూ పీజీ విభాగంలో అక్రమాలపై ప్రభుత్వం సిఐడి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.



