గుంటూరు నగరంలోని చుట్టుగుంట డ్రైనేజీ నిర్మాణ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధికారులను ప్రశ్నించారు. శివరాం నగర్ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలకు సీపీఐ స్వాగతం పలుకుతుందని, అయితే డ్రైనేజీ నిర్మాణం శాస్త్రీయబద్ధంగా జరగడం లేదని విమర్శించారు. నగరంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి పనులలో మున్సిపల్ అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారని వారు విమర్శించారు. అధికార పలుకుబడితో మున్సిపల్ స్థలాలను వంకరటింకరగా ఆక్రమిస్తూ కాలువ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇలా నిర్మిస్తే వర్షాకాలంలో చెత్తాచెదారం నిలిచి నీరు ఇళ్లల్లోకి వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. డ్రైనేజీ కాలువను సరిగా, నిలువుగా నిర్మించాలని, లేకపోతే స్థానిక ప్రజలను సమీకరించి ఆందోళనలు చేపడతామని ఆకిటి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు, నగర కార్యవర్గ సభ్యులు బి.వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: చుట్టుగుంట డ్రైనేజీ పనుల్లో అవకతవకలు జరిగితే సహించం: సీపీఐ

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
overcast clouds
27° _ 27°
72%
2 km/h
Tue
34 °C
Wed
35 °C
Thu
37 °C


