గుంటూరు నగరంలో కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. పెద్ద వాగు ప్రాజెక్టు పనులు నిర్మాణానికి రూ. 500 కోట్లు కేటాయించాలని, రైతాంగానికి సాగునీరు ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే కరీఫ్ సీజన్లో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారాన్ని కృషి చేయడం గురించి, 2026 ఖరీఫ్ సీజన్ కి అవసరమైన అన్ని పంటలకు నాణ్యమైన విత్తనాలను 90% సభ్యుడితో రైతాంగానికి అందించాలని ప్రవేట్ మార్కెట్లో అధిక ధరలు అమ్ముతున్న పలు రకాల పంటల విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అగ్రభాగాన్ని ఉన్న పత్రిక స్వేచ్ఛ ఉన్నటువంటి నార్వే దేశం నెంబర్ వన్ గా ఉందని, రెండు దేశాల ప్రధాన మంత్రుల మధ్య చర్చలు జరుగుతుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించకుండా భారతదేశ ప్రతిష్టను కాపాడాల్సిన ప్రధానమంత్రి మోడీ బ్యాంకులన్నీ దోపిడీ చేసి పారిపోవడం ఈ దేశ ప్రజలకు అవమానకరంగా ఉందన్నారు. జాతీయ నేత ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కోట మల్యాద్రి, సహాయ కార్యదర్సులు మేడా హనుమంతరావు, తిరుపతయ్య, నగర కార్యదర్శి అరుణ్ కుమార్, Aiyf జిల్లా కార్యదర్శి ఎస్కే వలి, నగర కార్యవర్గ సభ్యులు బి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
38°C
Vijayawada
scattered clouds
38° _ 38°
34%
5 km/h
Fri
37 °C
Sat
46 °C
Sun
47 °C


