ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో శుక్రవారం శారదా కాలనీలో పెరిగిన నిత్యవసర సరుకులతో నిరసన వ్యక్తం చేశారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ మోసం అన్నారు. కూటమి పాలనలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు.



