NTR Distric News :పారా స్విమ్మర్ల విజయాలకు శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందనలు

Sharat
1 View

విజయవాడ, జూన్ 17 :– బెంగళూరులో ఇటీవల నిర్వహించిన 26వ జూనియర్, సబ్‌ జూనియర్ జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారా స్విమ్మర్లు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు జరిగిన పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు 15 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలతో మొత్తం 29 పతకాలు సాధించి విశేష ప్రతిభ చాటారు.

ఈ నేపథ్యంలో విజేత పారా స్విమ్మర్లు బుధవారం విజయవాడలో శాప్ చైర్మన్ రవి నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించిన ఆయన, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు గౌరవం తీసుకువచ్చినందుకు ప్రశంసించారు.

పారా క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం, దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వారి ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు శాప్ తరఫున అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం క్రీడాకారులు తమ విజయాలను, పోటీల అనుభవాలను చైర్మన్‌కు వివరించగా, రవి నాయుడు వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పారా అసోసియేషన్ సభ్యుడు రామస్వామి, కోచ్‌లు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review