ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలకమైన ఇంటింటి సర్వే నేటి నుండి ప్రారంభమైన నేపథ్యంలో బిఎల్వోలు అత్యంత జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ సి యం సాయి కాంత్ వర్మ పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం కలక్టరేట్లోని వీసీ హాల్ నుండి జిల్లా అధికారులు, ప్రత్యెక అధికారులతో పీజీఆర్ఎస్, జలధార, యోగాంద్ర , రెవెన్యూ, విబి జీ రామ్ జీ , స్వర్ణ గ్రామ , స్వర్ణ వార్డు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ లో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో ప్రతి ఓటర్ కు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారని వాటిని పూర్తిచేసి తిరిగి బి ఎల్ ఓ లకు అందించాల్సి ఉంటుందన్నారు. ఫారాలు తిరిగి అందించని ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో ఉండవని ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలన్నారు. అదేవిధంగా రెవిన్యూ పరమైన మ్యూటేషన్, రీ సర్వే సమగ్రంగా నిర్వహించాలన్నారు. అలాగే జలధార పనులను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. పి జి ఆర్ ఎస్ లో అర్జీలను ఎస్ఎల్ఏ గడువు మించకుండా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. యోగాంద్ర కార్యక్రమంలో ఎక్కువమంది రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చూడాలన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: SIR ప్రక్రియలో కీలకమైన ఇంటింటి సర్వే పూర్తి జాగ్రత్తతో నిర్వహించాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
26°C
Vijayawada
light rain
26° _ 26°
87%
1 km/h
Wed
26 °C
Thu
25 °C
Fri
27 °C


