Macherlla Local News :గిరిజన విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించాలి-ఎం. ధారు నాయక్

Sharat
1 View

మాచర్ల, జులై 25 :– పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఏడోమైలు గ్రామంలోని బాలికల గిరిజన గురుకుల పాఠశాలను రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం. ధారు నాయక్ శనివారం సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినులను కలిసి వారి విద్యా పరిజ్ఞానాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి విద్యాభ్యాసం, వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను, పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించి, ఎలాంటి లోపాలు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. గిరిజన విద్యార్థినులు నాణ్యమైన విద్యను అభ్యసించేలా అవసరమైన మౌలిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యతోనే గిరిజన సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలదని పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review