తాడేపల్లి, సెప్టెంబర్ 20:-తాడేపల్లి మండలం, బుర్రముక్కు శ్రీరామిరెడ్డి నగర్ (కొత్తూరు)లోని వైయస్సార్ సెంటర్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ విరాజిల్లింది. మాజీ ఎంపీ గౌరవనీయులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారితో పాటు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరిపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ప్రజలు విలసిల్లాలని ఆకాంక్షించారు.Guntur City News
ఈ పూజా కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



