విశాఖపట్నం, సెప్టెంబర్ 22:- బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల రానున్న మూడు రోజులూ భారీ వర్షాల కురవనున్నాయని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరిలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి, ముందస్తు చర్యలపై పలు సూచనలు చేశారు. భారీ వర్షాల ప్రభావం ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు.ఏ విధమైన సెలవులు మంజూరు చేయ బడవన్నారు. లోతట్టు ప్రాంతాలు, కొండ వాలు ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో తక్షణమే పారుదల చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట సహాయక చర్యలు, రక్షణ బృందాలు, వాహనాలు, పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం తదితర సేవలకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలకు వర్షాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తత సూచనలు, అవసరమైన సమాచారం అందించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అధికారులను సంప్రదించేలా కంట్రోల్ రూమ్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ తో పాటు, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ,పశు, నష్టం జరగకుండా ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్లపు ప్రాంతాల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. డెలివరీ సమయానికి దగ్గరైన గర్భిణులను ముందుగానే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.Visakha City news
కలెక్టరేట్ తో పాటు, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్, ఇతర డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. అవన్నీ నిరంతరం పని చేస్తాయని, మూడు రోజుల పాటు ప్రజలకు సేవలందిస్తాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు, సిబ్బందికి డ్యూటీలు వేసినట్లు చెప్పారు. వారంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
కంట్రోల్ రూమ్ లు….
1. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్- 0891-2590100, 0891-2590102
2. జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్- 180042500009, వాట్సాప్ నెం.9014218870
3. విశాఖపట్టణం ఆర్డీవో కార్యాలయం-0891-2562977
4. భీమిలి ఆర్డీవో కార్యాలయం – 9014093139.



