Bapatla City News :బాపట్లలో వైభవంగా శ్రీ సంపత్ గణపతి నవరాత్రి ఉత్సవాలు

Sharat
1 View

బాపట్ల:- బాపట్లలో వెలసిన సుప్రసిద్ధ, 1500 సంవత్సరాల నాటి సుదీర్ఘ ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సంపత్ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సంపత్ గణపతి పరివార్ నిర్వాహకులు శ్రీ బాబూ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మంగళవారం స్వామివారికి విశేష అర్చనలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శాస్త్రోక్తంగా సామూహిక కుంకుమార్చనలు – మానసా దేవికి విశేష పూజలు:

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల సమక్షంలో శ్రీ సంపత్ గణపతికి శాస్త్రోక్తంగా సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అదేవిధంగా నాగ దేవత అయిన శ్రీ మానసా దేవికి విశేష పూజలు జరిపారు. సర్పాకార దోషాలు, కాలసర్ప దోషం, రాహు-కేతు దోషాల నివారణతో పాటు సంతాన భాగ్యం, నరోగ్యం, సంపద కలుగుతాయనే నమ్మకంతో మహిళా భక్తులు ఈ కుంకుమార్చన పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

కన్నులపండువగా కోలాట నృత్య ప్రదర్శన:

ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం ‘నందనందన కోలాట సమాజం’ సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సంప్రదాయ వస్త్రధారణలో కళాకారులు లయబద్ధమైన అడుగులతో చేసిన ఈ ప్రదర్శన ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హరిద్వార్ ‘మహా గాయత్రీ కలశాని’కి దివ్య హారతి:

హరిద్వార్ నుండి విచ్చేసిన పూజ్య స్వామీజీ గాయత్రీ దేవి మహత్యం మరియు విశిష్టతపై అనుగ్రహ భాషణం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 2,400 పుణ్య నదులు, ఉపనదులు, కాలువలు మరియు సముద్రాల పవిత్ర జలాలతో తెచ్చిన “మహా గాయత్రీ కలశాన్ని” సంపత్ గణపతి స్వామి వారి దివ్య సన్నిధిలో ఉంచి ప్రత్యేక హారతి సమర్పించారు. ఈ ప్రత్యేక హారతి మహోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. అనంతరం ఈ పవిత్ర మహా కలశాన్ని తిరిగి హరిద్వార్‌కు సాగనంపారు.Bapatla city News

కార్యక్రమం ముగిసిన అనంతరం విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review