HYderabad City News :ఆయుర్వేదానికి పూర్వ వైభవం తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం-ఆయుర్వేద డే వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

Sharat
1 View

హైదరాబాద్: ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదానికి కేంద్ర ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫ్యాప్సీ భవన్‌లో బీజేపీ మెడికల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ ఆయుర్వేద డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. ఆయుర్వేదం భారతదేశానికి చెందిన ప్రాచీన వైద్య సంప్రదాయమని తెలిపారు. గతంలో దేశాన్ని పాలించిన మొఘలులు, బ్రిటిష్ పాలకులు ఆయుర్వేద వైద్య విధానాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆయుర్వేదానికి గుర్తింపు పెరుగుతోందన్నారు.

ఆయుర్వేద వైద్యం ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం లభిస్తోందని రామచందర్‌రావు తెలిపారు. ప్రజల్లో ఆయుర్వేదంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ వైద్య విధానాలను ఆధునిక పరిశోధనలతో అనుసంధానం చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.Hyderabad City news

భారతదేశం నుంచి ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతం పెరిగినట్లు రామచందర్‌రావు తెలిపారు. ఆయుర్వేద వైద్య విధానం, ఔషధ ఉత్పత్తుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తోందన్నారు.

ఆయుర్వేదాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు పరిశోధన, ఔషధ తయారీ, ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయుర్వేద రంగంలో విశేష సేవలందిస్తున్న పలువురు వైద్యులను రామచందర్‌రావు ఘనంగా సన్మానించారు.

Author
Share This Article
Leave a review