Hyderabad City News :బేగంబజార్‌లో ఆకట్టుకుంటున్న గరుడ రూపంలోని గణనాథుడు

Sharat
1 View

హైదరాబాద్:– నగరంలో గణేశ్‌ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినూత్న గణేష్‌ మండపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బేగంబజార్‌లో శ్రీ అహీర్ యాదవ్ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

శ్రీకృష్ణుడు గరుడ రూపంలో ఉన్న ఆకృతిలో గణనాథుడిని ప్రతిష్ఠించి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత 22 ఏళ్లుగా గణేష్‌ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది భక్తులను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక అలంకరణలు, విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

మండపంలో గణనాథుడికి నిత్యం ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాలను చేపడుతున్నారు. గణేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో పెద్ద సంఖ్యలో భక్తులు మండపానికి తరలివస్తున్నారు.Hyderabad City news

బేగంబజార్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గరుడ రూపంలోని గణనాథుడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండపం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

Author
Share This Article
Leave a review