GUNTUR CITY NEWS: లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటిని తొలగించాలి

Karthik

భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరులో కమీషనర్ మయూర్ అశోక్ విస్తృతంగా పర్యటించారు. గత రాత్రి నుంచి కురిసిన వర్షానికి అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి పోయింది. ఆయా ప్రాంతాల్లో కమీషనర్ పర్యటించి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా వెంటనే వర్షపు నీటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Author
Share This Article
Leave a review