Amaravathi City News :వైద్యారోగ్య శాఖలో సరికొత్త విప్లవం- ‘ఎంఎంఏట్రిక్స్’ ఏఐ పోర్టల్‌ను ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

S Sarath
2 Views

అమరావతి (ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచే దిశగా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. కాగిత రహిత (పేపర్‌లెస్) పాలనలో భాగంగా, మంత్రి కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీ పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ‘ఎంఎంఏట్రిక్స్’ (MMATRIX – Minister’s Monitoring & Action Tracking of Representations & Inter-departmental eXecution) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నూతన పోర్టల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖలోనూ ఇప్పటివరకు లేని విధంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను రూపొందించడం విశేషం.

ఏమిటీ ‘ఎంఎంఏట్రిక్స్’?

ఈ విధానం ఈ-ఆఫీస్‌కు ప్రత్యామ్నాయం కాదని, ఈ-ఆఫీస్‌లో నడిచే దస్త్రాల (ఫైళ్ల) పురోగతిని, వినతుల పరిష్కారాన్ని రియల్ టైమ్‌లో నిరంతరం సమీక్షించేందుకు ఉపయోగపడే పర్యవేక్షణ వ్యవస్థ అని అధికారులు స్పష్టం చేశారు.Amaravathi Local News

ఈ పోర్టల్ ముఖ్యమైన ఫీచర్లు, నిర్వహణ తీరు:

  • మూడు రకాల గుర్తింపు సంఖ్యలు: ప్రతి అర్జీకి ఎంఎంఏట్రిక్స్ ఐడీ, ఈ-ఆఫీస్ రిసిప్ట్ నంబర్, ఈ-ఆఫీస్ ఫైల్ నంబర్ ఉంటాయి. ఈ మూడూ నమోదు కాకుండా దస్త్రం తదుపరి దశకు వెళ్లదు.
  • 10 రోజుల గడువు (Time-bound Action): అర్జీ అందిన రోజే వివరాలను వ్యవస్థలో నమోదు చేస్తారు. కార్యదర్శి స్థాయి పరిశీలన తర్వాత సాధారణంగా 10 పనిదినాల్లో పరిష్కరించేలా గడువు నిర్దేశిస్తారు.
  • పక్కా ఆధారాలతో నివేదిక (Action Taken Report): క్షేత్రస్థాయి అధికారులు కేవలం “పరిష్కరించాం” అని చెప్పడమే కాకుండా, తీసుకున్న చర్యలు, జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి రూపంలో ఆధారాలను (Evidence) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • కఠినమైన పరిశీలన: అధికారులు సమర్పించిన నివేదికలో లోపాలుంటే ఉన్నతాధికారులు దానిని తిరస్కరించి, మళ్లీ సరిచేయాలని పంపుతారు. పూర్చి స్థాయి సంతృప్తి చెందిన తర్వాతే అర్జీని ‘పరిష్కరించినది’ (Resolved) గా నమోదు చేస్తారు.
  • డ్యాష్‌బోర్డ్ & అలర్ట్లు: మంత్రి, కార్యదర్శి, హెచ్‌ఓడీలు, కమీషనర్ స్థాయి అధికారులు పెండింగ్ అర్జీలను, దాటిన గడువులను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో చూడవచ్చు. అధికారులకు ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్‌లు వెళ్తాయి.
  • సమీక్ష సమావేశాల ఆదేశాలకూ ట్రాకింగ్: వినతులే కాకుండా, మంత్రి నిర్వహించే రివ్యూ మీటింగ్‌లలో ఇచ్చే ఆదేశాల (Meeting ATR) అమలును కూడా ఈ పోర్టల్ ద్వారానే పర్యవేక్షిస్తారు.

ప్రజలకు, ప్రజాప్రతినిధులకు నేరుగా సమగ్ర సమాచారం

ఈ నూతన వ్యవస్థ వల్ల ప్రజలు తమ వినతిపత్రాల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తప్పుతుంది. అర్జీ ఏ దశలో ఉంది, ఏ అధికారి వద్ద ఉంది, ఏ చర్య తీసుకున్నారనే పూర్తి సమాచారాన్ని దరఖాస్తుదారులకు, వినతులు ఇచ్చిన ప్రజాప్రతినిధులకు నేరుగా తెలియజేస్తారు.

పాలనలో వేగం పెంచడంతో పాటు, ప్రతి అర్జీకి పక్కా జవాబుదారీతనం ఖరారు చేయాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ సంకల్పంతో రూపొందిన ఈ ‘ఎంఎంఏట్రిక్స్’ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Author
Share This Article
Leave a review