Gudivada City news :గుడివాడలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు-మోదీ సహకారంతో ఏపీ అభివృద్ధి దిశగా పయనం-వెనిగండ్ల రాము

Sharat
3 Views

గుడివాడ, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను గుడివాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని బీజేపీ, యువమోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భోజనం వడ్డిస్తూ అన్నదానాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన యువమోర్చా నాయకులను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ సహకారంతో విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. మోదీ చొరవతో అమరావతికి పునర్జీవం లభించిందని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం అండగా నిలిచిందని, పోలవరం నిర్మాణం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.126076207_010526balakrishna2a

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందన్నారు. దేశ అభ్యున్నతి, ప్రజల సంక్షేమం కోసం మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో మోదీ పనితీరును, సానుకూల దృక్పథాన్ని ప్రస్తావిస్తుంటారని చెప్పారు. నాయకత్వ సమావేశాల్లో చంద్రబాబు ప్రస్తావించే మోదీ స్ఫూర్తిదాయక ఆలోచనలను ఆదర్శంగా తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఏపీ ఎస్‌డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి కోసం మోదీ నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు సాధించిందని, 25 ఏళ్ల ప్రజా జీవితంలో దేశ సేవకు ఆయన అందించిన సేవలు విశేషమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఏపీ ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ గుత్తికొండ శ్రీ రాజబాబు, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, బీజేపీ జిల్లా నాయకులు సురేష్ లక్ష్మీనారాయణ గాంధీ, యర్రపోతు అర్జున్, అంగడాల సతీష్, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సాయన పుష్పవతి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జోన్స్ దయానంద్, గుడివాడ బీజేపీ టౌన్ అధ్యక్షుడు ఆర్కే, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, యువమోర్చా ప్రతినిధులు, ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review