GUNTUR DISTRICT NEWS: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

Karthik

తెనాలి మండలం బుర్రిపాలెంలో అక్టోబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ లతో కలిసి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదివారం పరిశీలించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి బుర్రిపాలెంలో ప్రారంభించనున్నారు. 3డీ సాంకేతికతతో ఇళ్లను బుర్రిపాలెం గ్రామంలో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ ఆర్.శ్రీనివాస మూర్తి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review