చిన్నగంజాం:– చిన్నగంజాం రైతు సేవా కేంద్రంలో గురువారం సాయంత్రం కౌలు రైతుల కోసం సీసీఆర్సీ (CCRC)లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కౌలు చేసుకునే ప్రతి రైతు పంట సాగు హక్కు పత్రం (CCRC) పొందడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలు పొందేందుకు అర్హత సాధిస్తారని వివరించారు.
అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరంలో కౌలు రైతులు ఎరువులు కొనుగోలు చేయడానికి కౌలు సాగు హక్కు పత్రం తప్పనిసరిగా అవసరమని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



