Hyderabad City News :ఖైరతాబాద్‌ ఉపఎన్నిక- బీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే కేటాయించాలి- మాజీ కార్పొరేటర్‌ మహేష్‌ యాదవ్‌ ఆశాభావం

S Sarath
1 View

హైదరాబాద్:-ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో, గులాబీ దళం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీ అధిష్ఠానం తనకే టికెట్ కేటాయిస్తుందనే నమ్మకం ఉందన సోమాజిగూడ మాజీ కార్పొరేటర్, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకుడు మహేష్‌ యాదవ్‌ వెల్లడించారు.

ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌ ప్రాంతంతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తుచేశారు. తాను స్థానికుడిగా ఇక్కడి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్నట్లు తెలిపారు.Hyderabad City News

స్థానిక సమస్యలపై పూర్తి పట్టు:

ఖైరతాబాద్‌లోని క్షేత్రస్థాయి సమస్యలు, భౌగోళిక పరిస్థితులు, ప్రజల అవసరాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. కార్పొరేటర్‌గా సేవలందించిన సమయంలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ తోడుగా నిలిచానని చెప్పారు.

అధిష్ఠానం గుర్తించాలని విజ్ఞప్తి:

పార్టీ కోసం తాను చేసిన సేవలు, స్థానికంగా ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, క్షేత్రస్థాయి బలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ అధినేతలను కోరారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ జెండాను ఎగరవేసేందుకు తాను సర్వసన్నద్ధంగా ఉన్నానని, ఈ ఉపఎన్నికలో తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review