GUNTUR DISTRICT NEWS: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అక్రమాలపై విచారణ జరిపించాలి

Karthik

ప్రధాని నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ఆరోపించారు. ఇదే అంశంపై బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం మీడియాతో మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యన్నం సుధీర్ బాబు మాట్లాడుతూ, బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది అన్నారు. అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న నరేంద్ర మోడీ మూడుసార్లు అధికారంలోకి వచ్చారంటే దొంగ ఓట్లతోనే అన్నారు. తక్షణమే కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.‌ ఆయనపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మెంబర్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షులు ఖలీల్, పశ్చిమ సమన్వయకర్త డాక్టర్ జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review