ప్రజారోగ్య రక్షణకు పాటుపడే పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అక్టోబర్ 2వ తేదీన పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో గుంటూరు నగరపాలక సంస్థ మెగా మెడికల్ క్యాంప్ చేపడుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం లక్ష్మీపురం మెయిన్ రోడ్ లోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ ని పరిశీలించి, మెడికల్ క్యాంప్ ఏర్పాటుపై తీసుకోవాల్సిన చర్యపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజారోగ్య కార్మికులకు, వారి కుటుంబ సభ్యలకు అన్ని రకాల వైద్య పరీక్షలు, అవసరమైన మందులు ఉచితంగా అందించేందుకు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. క్యాంప్ లో విభాగాల వారీగా వైద్యులకు, వారి వద్దకు వచ్చే కార్మికులకు తగిన కుర్చీలు, టేబుల్స్ సిద్దం చేయాలన్నారు. త్రాగునీరు, ఇతర మౌలిక వసతులను ఎస్ఈ తో సమన్వయం చేసుకొని అందించాలని సిఎంఓహెచ్ ని ఆదేశించారు. డివిజన్ల వారీగా కార్మికులకు నిర్దేశిత సమయం కేటాయించడం ద్వారా ఒక్కసారిగా వచ్చే సమస్య ఉండదన్నారు. అనంతరం రవీంద్ర నగర్, పట్టాభిపురంల్లో వివిధ అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, నూతన డ్రైన్ లేదా రోడ్ నిర్మాణం అనంతరం సంబందిత కాంట్రాక్టరే నిర్మాణ వ్యర్ధాలను తొలగించిన పిదపనే బిల్లులకు ప్రాసెస్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. రోడ్లపై రాకపోకలకు అడ్డుగా నిర్మాణ సామగ్రి వేసే వారికి వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చి మెటీరియల్ ని సీజ్ చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.పర్యటనలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, డిఈఈ వెంకటరమణ, ఏడీహెచ్ శాంతి, ఎస్ఎస్ సోమ శేఖర్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: పారిశుద్ధ్య కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
overcast clouds
27° _ 27°
77%
1 km/h
Thu
34 °C
Fri
33 °C
Sat
33 °C


