GUNTUR DISTRICT NEWS: అక్టోబర్ 2న స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 బహుకరణ

Karthik

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 బహుకరణ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం కింద స్వచ్ఛత కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఆర్.ఆర్.ఆర్ (Reduce–Reuse–Recycle) విధానం, పర్యావరణహిత, సుస్థిర పద్ధతుల అమలులో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేస్తున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం 26 విభాగాల్లో సమగ్ర స్వచ్ఛత సర్వే నిర్వహించడం విశేషమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ తరహాలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ను సంస్థాగతం చేసి, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో అత్యుత్తమ పనితీరును గుర్తించడంతో పాటు, స్వచ్ఛత భావనను ప్రజలు, సంస్థలు, అన్ని వర్గాల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహించడం జరుగుతోందని వివరించారు

Author
Share This Article
Leave a review