GUNTUR CITY NEWS: నగరపాలక సంస్థ కార్యాలయంలో గ్రీవెన్స్

Karthik

ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ. కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినవే వస్తున్నాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే, ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి, ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలియచేశారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.పిజిఆర్ఎస్ ద్వారా 26 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 8, ఇంజినీరింగ్ విభాగం 13, రెవెన్యూ విభాగం 1, ప్రజారోగ్య విభాగం 1, ఎలక్షన్ సెల్ 1, ఉపా సెల్ విభాగం 1 , అకౌంట్స్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు.కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ సాంబశివరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, డిసిపి సూరజ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, విభాగాధిపతులు, మేనేజర్ బాలాజీ బాషా పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review