Bapatla District city News :కంకటపాలెం రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ-సమగ్ర భూ రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం- ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు

S Sarath
2 Views

బాపట్ల:– బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో సమగ్ర భూ రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో పాటు అధికారిక రాజముద్రతో రూపొందించిన నూతన పాస్ పుస్తకాలను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు రైతులకు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ.. రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర భూ రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రీ-సర్వే పూర్తవడంతో భూములకు సంబంధించిన వివరాలు మరింత స్పష్టంగా నమోదవుతాయని తెలిపారు.

నూతన పట్టాదారు పాస్ పుస్తకాల్లో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు ఉండటంతో రైతుల భూములకు మరింత భద్రత లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాలు, హక్కులు, రికార్డులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుందని అన్నారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న భూ రికార్డు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.Bapatla District city News

కంకటపాలెంలో రీ-సర్వే ప్రక్రియ పూర్తయి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. భూములకు సంబంధించిన రికార్డులు పక్కాగా నమోదుకావడం వల్ల భవిష్యత్తులో వివాదాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆర్‌డీఓ హరి కుమార్, తహసీల్దార్ సలీమా, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review