Bapatla District city News :బాపట్లలో సఖీ కేంద్రం ప్రారంభం.. మహిళలకు అండగా ‘వన్ స్టాప్ సెంటర్

S Sarath
2 Views

బాపట్ల, అక్టోబర్ 12 :– ఆపదలో ఉన్న మహిళలకు కొండంత భరోసా కల్పించేందుకు సఖీ వన్ స్టాప్ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు స్పష్టం చేశారు. సోమవారం బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ వెనుక భాగంలో సుమారు రూ.60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సఖీ వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ రకాల వేధింపులు, హింసకు గురయ్యే మహిళలకు వైద్యం, న్యాయ సలహాలు, మానసిక కౌన్సెలింగ్‌తో పాటు తాత్కాలిక ఆశ్రయం వంటి అన్ని సేవలను ఒకే గొడుగు కింద అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, బాధితులకు సత్వర న్యాయం అందించేలా అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం నూతన భవనంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ గదులు, వైద్య సహాయ విభాగం, ఇతర వసతులను ఎమ్మెల్యే పరిశీలించి, అక్కడి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారుBapatla District city News.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review