జిల్లాలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలు. జిల్లాలో గుంటూరు, తెనాలి పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, అక్టోబర్ 28న పోలింగ్, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వివరించారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 15న ప్రారంభమై నవంబర్ 26న పోలింగ్, రెండో దశ నామినేషన్లు నవంబర్ 18న ప్రారంభమై నవంబర్ 29న పోలింగ్, మూడో దశ నామినేషన్లు నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 76 వార్డులు, తెనాలి పట్టణంలో 52 వార్డులు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. గుంటూరు పరిధిలో 6,09,667 మంది, తెనాలి పరిధిలో 1,57,089 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షణ కోసం 50 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 50 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. కుల ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం ఉండదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎటువంటి జాప్యం ఉండదన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కుల ధృవీకరణ పత్రం కలిగిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన వారికి 24 గంటల్లోగా పత్రాలు అందించేలా ఏర్పాటు చేసామన్నారు. సున్నిత, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటిలో అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. జిల్లాలో 6000 మంది ఉద్యోగులను ఎన్నికల ప్రక్రియకు నియమించామన్నారు.ఈ పాత్రికేయ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
86%
1 km/h
Thu
27 °C
Fri
31 °C
Sat
30 °C


