GUNTUR CITY NEWS: SIR ప్రక్రియను నిలుపుదల చేయాలి

Karthik

గుంటూరులోని పలు పౌర సంస్థలు ప్రజాసంఘాలు సర్ ప్రక్రియను ఆపివేయాలని, జంతర్ మంతర్ ధర్నా కేంద్రాన్ని పునరుద్ధరించాలని, తొలగించిన 13 కోట్ల ఓట్లను పునః పరిశీలించాలని,భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలని కోరుతూ ఈనెల 16వ తేదీన సాయంత్రం గుంటూరులోని లాడ్జ్ సెంటర్ వద్ద గల డా|| అంబేద్కర్ విగ్రహo వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తుందని ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చి దళితులు, గిరిజనులు, నిరక్షరాస్యులు, మైనార్టీలు, వలస కార్మికుల ఓట్లను దాదాపు 13 కోట్లు తొలగించినారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ,జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి తొత్తులుగా మారాయన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ,ఇండియా కూటముల ఆధ్వర్యంలో జరుగుతున్న మహా ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు, మధ్యతరగతి ఉద్యోగుల సంఘ నేత వివికె సురేష్, అవగాహన కార్యదర్శి కొండ శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review