Markapur District City News :మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సమావేశం-అన్నా రాంబాబు ఆధ్వర్యంలో సమావేశం.. ఎన్నికల నిర్వహణ, న్యాయపరమైన అంశాలపై చర్చ

S Sarath
1 View

మార్కాపురం:- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్కాపురంలోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అన్నా రాంబాబు ఆధ్వర్యంలో లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు, వివిధ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యలు, ఎన్నికలకు సంబంధించి న్యాయపరమైన అంశాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయపరంగా అందించాల్సిన సహకారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అంశాలపై న్యాయవాదులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసరావు, మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షుడు భూపని కాశయ్య, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి స్వామిరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు దర్నాసి హరిబాబు, యర్రగొండపాలెం అధ్యక్షుడు సుబ్బారెడ్డి, గిద్దలూరు అధ్యక్షుడు హిమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.Markapuram District City News

అలాగే జిల్లా లీగల్ సెల్ సభ్యులు చౌడేశ్వరరావు, ఆర్. బాలు నాయక్, గాయం సావిత్రి, రామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మోహన్, రఘుచంద్రుడు, అశోక్ నాయక్, రహంతుల్లా, పురుషోత్తం నాయక్, మధు తదితర న్యాయవాదులు సమావేశానికి హాజరయ్యారు.

Author
Share This Article
Leave a review