పెదకూరపాడు:– స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వరుసగా రెండో రోజు సమావేశాలు నిర్వహించారు. పెదకూరపాడు, బెల్లంకొండ మండలాలకు చెందిన వివిధ గ్రామాల నాయకులతో సమావేశమైన ఆయన, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే అంశాలపై దిశానిర్దేశం చేశారు.
గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామాల్లో పార్టీ పరిస్థితులు, నాయకులు, కార్యకర్తల పాత్ర, ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించాలని నంబూరు శంకరరావు సూచించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.Guntur City News
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.



