చీరాల ముక్కోణం పార్క్ సెంటర్‌కు భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని డిమాండ్ చేశారు. ఈ పేరుమార్పు కోసం చాలా కాలంగా అభ్యర్థనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన మహనీయుడైన అంబేద్కర్ గౌరవార్థం, మున్సిపల్ అధికారులు మరియు పాలకులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.



