గుంటూరు నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల నిర్వహణను అత్యంత పటిష్టంగా, పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ స్థానిక ఆంధ్రాముస్లిం కాలేజిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కోసం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి ప్రాంగణాన్ని కౌంటింగ్ సెంటర్ల కోసం పరిశీలించితీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థలో 76 వార్డ్ లకు సంబంధించి 596 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారుల వారీగా ఎన్నికల సామాగ్రి సక్రమంగా ఇబ్బందులు లేకుండా అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి సామాగ్రి తరలించడానికి వచ్చే బస్ లకు సరైన మార్గం ఉండేలా, సిబ్బందికి భోజనం సదుపాయం పక్కాగా చేపట్టాలని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్ లు భద్రపరచడం, తదుపరి కౌంటింగ్ చేయడానికి తగిన బ్యారీ కేడింగ్, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. టౌన్ సర్వేయర్లతో సమన్వయం చేసుకుంటూ సిటి ప్లానర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లకు సంబందించి సమగ్ర మ్యాప్ సిద్దం చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు. పర్యటనలో ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సిఈఓ జ్యోతిబసు, జిఎంసి అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటి కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిటి ప్లానర్ డి.రాంబాబు, సర్వేయర్లు లక్ష్మీనారయణ, సుభాని పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: కార్పొరేషన్ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
26°C
Vijayawada
heavy intensity rain
26° _ 26°
91%
2 km/h
Sat
25 °C
Sun
28 °C
Mon
32 °C


