రేపల్లె:– మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. మొత్తం 36 వార్డులకు 181 నామినేషన్లు దాఖలు కాగా, వివిధ కారణాలతో ఎనిమిది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 173 నామినేషన్లు చెల్లుబాటైనట్లు అసిస్టెంట్ ఎన్నికల అధికారి కాకర్ల సాంబశివరావు వెల్లడించారు.
మున్సిపల్ చైర్మన్ పదవికి మొత్తం 10 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో చైర్మన్ పదవికి సంబంధించిన తొమ్మిది నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.
అదేవిధంగా వివిధ వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన ఎనిమిది మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.Bapatla District City News
ఈ నెల 20, 21 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. 21వ తేదీ సాయంత్రం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడంతో పాటు వారికి ఎన్నికల గుర్తులను కేటాయించనున్నట్లు వెల్లడించారు.



