*కూటమికి ఓటు.. అభివృద్ధికి రూటు** గుంటూరు నగరాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేస్తాం* తూర్పులో రూ.400 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం* విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట* మురుగు శాశ్వత పరిష్కారానికి చర్యలు* కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి* 75, 76 డివిజన్లలో ఎమ్మెల్యే నసీర్, మేయర్ అభ్యర్థి లక్ష్మీఅపర్ణ ఎన్నికల ప్రచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయడం గుంటూరు నగర అభివృద్ధికి బాటలు పరచడమేనని తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శుక్రవారం స్థానిక 75, 76 డివిజన్లలో నగర మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, కార్పొరేటర్ అభ్యర్థులు ఏల్చూరి నాగక్రాంతి, అంకం మాలినితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి డివిజన్ లోనూ ప్రజలు కూటమి నేతలకు బ్రహ్మరథం పట్టారు. రెండున్నరేళ్లలో అన్ని వర్గాలకు మేలు జరగడంతో అభివృద్ధిని కొనసాగించేందుకు కూటమి నేతలకు తాము మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆర్థిక సంఘ నిధులు మంజూరవుతాయని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని, దీనికి అడ్డుకునేందుకు గొడ్డలి కుయుక్తులు పన్నుతోందని ఎమ్మెల్యే నసీర్ మండిపడ్డారు. రాష్ట్రంలో త్వరలో నూతన పింఛన్లు మంజూరు చేయబోతున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించబోతున్నామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వెంటనే తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి బలం చేకూర్చడం ద్వారా గుంటూరు నగరంలో మరింత అభివృద్ధి సాధించుకోవచ్చన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూలేని విధంగా అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సుమారు రూ.350 కోట్లు వెచ్చించామన్నారు. మురుగు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లను సైతం సీసీలుగా తీర్చిదిద్దుతున్నామని, గత వైసీపీలో గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కేవలం రోడ్లనే కాకుండా పార్కులు, క్రీడా ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్ నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని, తద్వారా యువతకు ఉద్యోవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యా సంస్కరణలకు నాంది పలికారని, గత పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా తెలిసిందన్నారు. నియోజకవర్గంలో నలుమూలలుగా అభివృద్ధికి పునాదులు వేశామని, దీనిని మరింత కొనసాగించాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నేతలు చిట్టా బత్తిని చిట్టిబాబు, ఏల్చూరు కిరణ్,కొల్లా శ్రీను, పుట్టా దుర్గ, జంపరాల శ్రీను, బాబు, నన్నపనేని వేణుబాబు, గడ్డం రోశయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: కూటమికి ఓటు.. అభివృద్ధికి రూటు – గుంటూరు నగరాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేస్తాం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
28°C
Vijayawada
overcast clouds
28° _ 28°
82%
1 km/h
Fri
28 °C
Sat
33 °C
Sun
32 °C


