Hyderabad City News :డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి- జూటూరు కీర్తిరెడ్డి

S Sarath
1 View

హైదరాబాద్, నవంబర్ 23:-మత్తు పదార్థాల మహమ్మారిని తరిమికొట్టి, ‘నషా ముక్త్ భారత్’ (డ్రగ్స్ రహిత భారత్) లక్ష్యాన్ని సాకారం చేసేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డి పిలుపునిచ్చారు. భాగ్యనగరంలో ఆదివారం నిర్వహించిన ‘సిటీ కన్వెన్షన్ ఆన్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ.. యువత దేశానికి వెన్నెముక అని, వారి భవిష్యత్తును నాశనం చేసేందుకు డ్రగ్స్ మాఫియా కుట్రలు పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రభుత్వాల వల్లే ఇది సాధ్యం కాదని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఏకతాటిపైకి వచ్చి డ్రగ్స్‌పై సమరశంఖం పూరించాలని కోరారు.Hyderabad City News

25 నుంచి భారీ అవగాహన ర్యాలీ: డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరిట భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు సాగే ఈ అవగాహన నడకలో నగరవాసులు, ముఖ్యంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కీర్తిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review