Hyderabad City News :క్రాఫ్ట్ కౌచర్ కొత్త స్టోర్ ప్రారంభం

S Sarath
1 View

హైదరాబాద్, (న్యూస్ రిపోర్టర్):-సాంప్రదాయ భారతీయ చేనేత కళకు ఆధునిక సొబగులు అద్దుతూ, సహజ సిద్ధమైన వస్త్రాలతో రోజువారీ ఫ్యాషన్‌కు కొత్త నిర్వచనం చెప్పేందుకు ‘క్రాఫ్ట్ కౌచర్’ (Craft Couture) నగరంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని పెర్ల్ కార్డినల్ వద్ద ‘హౌస్ ఆఫ్ గౌరీ’ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.Hyderabad City News

పర్యావరణ హితమైన ఫ్యాషన్‌కు ప్రాధాన్యతనిస్తూ ఈ బ్రాండ్‌ను తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. చర్మానికి ఎంతో అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉండేలా సహజ ఫైబర్స్‌తో నేసిన సరికొత్త డిజైనర్ చీరలు, కుర్తీలు, డ్రెస్సులు మరియు స్కర్టులు ఇక్కడ కొలువుదీరాయి. ముఖ్యంగా, రీసైకిల్డ్ ఫైబర్స్‌తో రూపొందించిన ప్రత్యేక కలెక్షన్ ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన ఈ వస్త్రాలు నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review