Hyderabad City News :ఉద్యోగుల సమస్యలపై కమిటీ ల పేరుతో కాలయాపన చేయకుండా.. ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి-శ్యామ్ (తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి)

S Sarath
1 View

Hyderabad;- ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయొద్దని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమావేశ మందిరంలో టీజీఓ (TGO) హైదరాబాద్ శాఖ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. శాఖ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై చర్చించారు.Hyderabad City News

రెండవ వేతన సవరణ సంఘం (PRC) నివేదికను ప్రభుత్వం తక్షణమే స్వీకరించి… 42 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని టీజీఓ ప్రధాన కార్యదర్శి శ్యామ్ కోరారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులన్నింటినీ వెంటనే క్లియర్ చేయాలని… నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ నినో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కనీసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనైనా వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Author
Share This Article
Leave a review