యాంటీ డ్రగ్స్ ఫోరండ్రగ్స్, గంజాయి పై విద్యార్దులలో, తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారానే నిర్మూలించగలం అని యాంటీ డ్రగ్స్ ఫోరం కన్వీనర్ ఎల్.ఎస్.భారవి అన్నారు. గుంటూరు పట్టణంలోని కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి కరప్రతాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్.ఎస్.భారవి మాట్లాడుతూ ఒకప్పుడు మెట్రోపాలిటిన్ సిటీలకే పరిమితమైన మాదకదవ్వాలు నేడు ప్రతి చిన్నపట్టణంలో, గ్రామంలో కూడా గంజాయి రూపంలో పెద్ద ఎత్తున లభ్యం అవుతుంది. ముఖ్యంగా పాఠశాలల బయట చాక్లెట్లు పెట్టి విక్రయింస్తున్నారు. అలాగే ఫెవికాల్, బబుల్ గమ్‌లో పెట్టి గంజాయిని విక్రయిస్తున్నారు. ఇది విద్యార్ధులను, యువతను నిర్వీర్యం చేసే ధారణుమైన శక్తి గా ముందుకువచ్చింది. అందేకే పౌరసమాజం నుండి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. భవిష్యత్‌లో యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో పేటల్లో, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వీటిల్లో అందురూ పాల్గొని జయప్రదం చేయాలని, డ్రగ్స్, గంజాయి భారీ నుండి యువతను, విద్యార్ధులను కాపాడటానికి మీ వంత సహకారం అందించాలని కోరారు.యాంటీ డ్రగ్స్ ఫోరం సభ్యులు, మానవత సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ దేశానికి యువత వెన్నెముక లాంటి వారు, ఈ దేశ భవిష్యత్ సరిగ్గా ముందుకు వెళ్ళాలి అంటే యువత సరైన మార్గంలో నడవటం ముఖ్యమైనది. కాని గంజాయి, మారకదవ్వాలకు బానిసలై అసాంఘీక కార్యక్రమాలు చేసే వారిగా తయారవుతున్నారు. మత్తులో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు హత్యలు కూడా చేసే పరిస్థితి సమాజంలో పెరుగుతుందన్నారు. అందుకే వీటిపై అవగాహన కార్య్రక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యాంటీ డ్రగ్స్ ఫోరం సభ్యులు ఐ.ఎమ్.ఎ గుంటూరు అధ్యక్షులు డాక్టర్ సేవా కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయిపై అవగాహన ద్వారానే నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. నేడు ఇది వార్డుస్థాయిలోకి వచ్చిందన్నారు. దీనికి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అడెక్టు అవుతున్నారన్నారు. మత్తులో వారు ఏమిచేసేది కూడా తెలియదన్నారు. యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మేము కూడా సహకరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో యాంటీడ్రగ్స్ ఫోరం కో కన్వినర్ వై.కృష్ణకాంత్, ఫోరం సభ్యలు రేట్‌పేయర్స్ నాయకులు ఓ.నారాయణ రెడ్డి, మానవత సంస్థ నాయకులు కొటేశ్వరరావు, యు.సాంబశివరావు, ఐద్వా నగర కార్యదర్శి కళ్యాణి, జె.వి.వి నాయకులు కె.జాన్‌బాబు, యు.టి.ఎఫ్. నాయకులు ఎమ్.కళాధర్, యు.రాజశేఖర్, ఎమ్.హనుమంతరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజయ్‌కుమార్, జాషువా విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కన్వీనర్ ఎన్.భావన్నారాయణ తదితరలు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: డ్రగ్స్, గంజాయిపై అవగాహన ద్వారానే నియంత్రించగలం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
37°C
Vijayawada
overcast clouds
37° _ 37°
36%
6 km/h
Tue
36 °C
Wed
41 °C
Thu
38 °C


