GUNTUR CITY NEWS: గుంటూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

Karthik

కొణిదల పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈమేరకు కొరిటపాడు ఓరియంటల్ స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, స్థానిక ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో మిర్చి యార్డు డైరెక్టర్ కటకంశెట్టి విజయలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు నాయబ్ కమల్, మెడికల్ క్యాంపు ఆర్గనైజర్ పవన్ వెంకీ తదితరులు పాల్గొన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృతంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.

Author
Share This Article
Leave a review