గుంటూరులోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన మహానాడు డిజిటల్ క్లస్టర్ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.మొదటగా టీడీపీ సీనియర్ నాయకులు ఉల్లి గోపాల్ రావు, నీలం ప్రసాదరావు ఆధ్వర్యంలో స్థానిక 18, 20వ డివిజన్ల పరిధిలో నల్లచెరువు సమీపంలోని సంపత్ నగర్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ గా క్లస్టర్ స్థాయిలో మహానాడు జరిగిన కార్యక్రమానికి, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 35, 19 డివిజన్లు, అలాగే 33, 36, 37 డివిజన్లు కలిపి ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడు క్లస్టర్ కార్యక్రమాల్లో…అనంతరం 42, 43 డివిజన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం భారత్‌పేటలోని మదర్ తెరిసా కమిటీ హాల్‌లో 23, 49 డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు.అదేవిధంగా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు మహానాడు ఒక మహా పండుగ లాంటిదని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఇంధన పొదుపు పిలుపునకు అనుగుణంగా ఈసారి మహానాడును క్లస్టర్ విధానంలో డిజిటల్ రూపంలో నిర్వహించడం జరిగిందన్నారు. పార్టీలో ప్రధాన బాధ్యతలు స్వీకరించిన శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో మహానాడు కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చినా, రాకపోయినా 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించడం మహిళా సాధికారత దిశగా చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
GUNTUR DISTRICT NEWS: గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ డిజిటల్ మహానాడు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
33°C
Vijayawada
scattered clouds
33° _ 33°
52%
2 km/h
Thu
43 °C
Fri
44 °C
Sat
44 °C


